ఆటో స్టాండ్ ఏర్పాటు చేయండి..

కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ కు విజ్ఞప్తి
మేడిపల్లి – జనంసాక్షి
మేడిపల్లిలో ఆటో స్టాండ్ ఏర్పాటు కోసం కృషి చేయాలని మేడిపల్లి ఆటో యూనియన్ అధ్యక్షులు అమీర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రోజున కమిటీ సభ్యులందరూ కలిసి 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ను కలిసి ఈ విషయమై విన్నవించారు. ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ప్రయాణానికి కూడా ఎవరికి అయోమయం ఉండదని అన్నారు. అందువల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు కోసం సహకరించాలని కార్పోరేటర్ ను కోరారు.
Attachments area