ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా గుండా రంగారెడ్డి
జగదేవ్ పూర్ ,జూలై 20 జనం సాక్షి:
గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా జగదేవ్ పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన గుండా రంగారెడ్డి రెండవసారి నియామకం అయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఆత్మ నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు. అదేవిధంగా జగదేవ్ పూర్ మండలం నుండి మల్లారెడ్డి, కర్రే లలిత, జుర్రు ఐలయ్య, సంతోష్ రెడ్డి, చాట్లపల్లి లక్ష్మణ్, కౌసల్య, గణేష్ లకు డైరెక్టర్ లు గా చోటు లభించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ఆత్మ కమిటీ చైర్మన్ గా తనను రెండవసారి నియామకం చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సహకరించిన ఎంపీపీ, జెడ్పిటిసిలకు, పీఏసీఎస్ చైర్మన్ లకు గజ్వేల్ నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.