దుబ్బాక ఐ.సి.డి.యస్ .ప్రాజేక్ట్ సిడిపిఓ -సుకన్య
మిరుదొడ్డి ,సెప్టెంబర్ 01,(జనంసాక్షి)
బిడ్డలు ఆరోగ్యంగా ఉండటమే ప్రతితల్లి కోరుకుంటుదని, తల్లి-బిడ్డలు ఇద్దరి ఆరోగ్యం ఆహరం మీద ఆధారపడి ఉంటాయని ఐ.సి.డి.యస్ .దుబ్బాక ప్రాజేక్ట్ సిడిపిఓ సుకన్య గారు అన్నారు. మిరుదొడ్డి మండల పరిధీలోని అందె గ్రామంలో ఏర్పాటు చేసిన పోషకాహార వారోత్సావాల కార్యక్రమంలో పాల్గోని అమే మాట్లడుతూ ముఖ్యంగా బిడ్డల ఆరోగ్యం తల్లిమీదే ఉంటుందని తల్లిపాలు శ్రేష్ఠమైనవని, ఆడజన్మ ఏంతగోప్పదో తల్లిపాలు అంతగొప్పవన్నారు.స్త్రీ తనకు గర్భం వచ్చిందని తెలుకున్నప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు చాల జగ్రత్తగా ఉండాలన్నారు.ముఖ్యంగా మంచి ఆహరం అందక కాన్పు కష్టమవుతోందని ఒక్కోసారి తల్లీ బిడ్డలు మరణిస్తారన్నారు.సుఖప్రసవం జరగాలంటే ఆ తొమ్మిది నెలలూ పోషకాహారం అవసరమన్నారు.పోషక విలువలున్న ఆహరం అనగా పాలు, గ్రుడ్లు,మాంసం,పప్పులు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటరన్నారు.సోయ చిక్కుడు వేరుసెనగలలో కూడా మాంసకృతులు ఎక్కువగా ఉంటాయన్నారు.వీటివల్ల శరీర పెరుగుదల సాద్యపడుతుందన్నారు. కొవ్వు,నూనెలను కూడ వాడల్సి ఉంటుందన్నారు.దేశమంతట ఐ.సి.డి.ఎస్ ను అమలు చేస్తున్నారన్నారు.పోషకాహారాన్ని ఏ ఒక్కరూ అశ్రద్ధ చేయకూడదు.పిల్లలకు,తల్లులకు సరైన పోషకాహారం అందకపోతే రకరకాల రోగాలు వస్తాయన్నారు.విటమిన్ -ఎ తగ్గితే కంటిచూపు పోతుందన్నారు.విటమిన్ -బి తగ్గితే బెరిబెరి వస్తుందన్నారు.విటమిన్ -సి లోపం వల్ల వచ్చేది స్కర్వీ ఇనుం తగ్గితె దంతాలు పాడవుతాయన్నారు.ఐ.సి.డి.యస్ .మిరుదొడ్డి సుపర్ వైజర్ నాగమణి గారు మాట్లడుతూ ఇప్పుడు ప్రభుత్వం మరేన్నో ఆమలు చేస్తుందన్నారు .ఐ.సి.డి.ఎస్ తొ పాటు మరేన్నో కార్యక్రమాలు మొదలు పెట్టింది.1970లో ప్రత్యేక పోషకాహారం,1971లో బాల్వాడి పోషకాహార కార్యక్రమం ప్రారంభమైదన్నారు.అన్ని అనర్థాలకి మూలం “ఆహార కొరత” ఈ నిజాన్ని ప్రభుత్వం గుర్తించిదన్నారు.ఇందుకొసమే జాతీయ పోషకాహార కార్యక్రమాలను తయారు చేసి వాటిలో ఐ.సి.డి.ఎస్ .ఒక్కటన్నారు.దీని పూర్తి పేరు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ స్కీమ్ అన్నారు.దాని అర్థం సమీకృత బాలల అభివృద్ధి -సేవా కార్యక్రమం దీనిని భారత ప్రభుత్వం 1975లో ప్రారంభించిదన్నారు. బాలల సమగ్ర ఎదుగుదల దీని ఉద్దేశ్యమన్నారు.ఆరేళ్ళలోపు పిల్లలు ఈ పథకంలో లబ్ధి పోందుతారన్నారు.ఇంకా 16-41 సం”రాల చూలింత, బాలింతలకు ఉపయోగపడుతుందన్నారు.సర్పంచ్ బుర లింగంగౌడ్ మాట్లడుతూ అటు పిల్లలకు, ఇటు గర్భవతులకు దేశమంతటా ఉచితంగా మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో యంపిటిసి .సోమేశ్వర్ రెడ్డి, అంగన్ వాడి టిచర్స్ రమ, విజయ,కవిత ఆశావర్కర్లు మహిళలు పాల్గోన్నారు.
Related