ఆడపడుచులకు ఎల్లేని దీపావళి కానుక. చీరలు పంపిణీ చేసిన ఎల్లేని దంపతులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 18(జనంసాక్షి):
లోటస్ గార్మెంట్ కంపెనీలో ఉపాధి పొందు తున్న కార్మిక ఆడ బిడ్డలకు దీపావళి పండుగ కానుకాగ భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు,భారతి దంపతులు మంగళవారం సారె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గార్మెంట్స్ కంపెనీలో ఉపాధి పొందుతున్న పేదింటి మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులుగా బతుకమ్మ, దసరా పండుగ మాతో కలిసి జరుపుకోవ డం మరియు ప్రతి విషయంలో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఎల్లేని సుధాకర్ రావు కు ధన్యవాదములు అని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు ముఖ్యంగా ఆడపడుచులకు అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల,పట్టణ,బీజేపీ నాయకులు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
Attachments area