*కమిషనర్కు వినతి పత్రం*

* కమిటీ హాల్ బస్తివాసులదేనని వినతి పత్రంలో పేర్కొన్న తూర్గొండ రాములు
* అధికారికంగా కమిటీ హాల్ ను అభివృద్ధి చేయాలని కమిషనర్ కు వినతి
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) అక్టోబర్ 18 :- కమిటీ హాల్ స్థలం కబ్జాకు గురవుతుందని వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ గబ్బిలాలిపేట బస్తి వ్యవస్థాపకులు తూర్గొండ రాములు కరాటే రాజులు స్థానికులతో కలిసి బస్తి వాసులందరికీ వినియోగ కరంగా ఉన్న కమిటీ హాల్ ను అధికారికంగా అభివృద్ధి చేయాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది వినతి పత్రంలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి తూర్గొండ రాములు కరాటే రాజు మేడ నాగభూషణములు తలదాచుకునేందుకు తావులేని నిరుపేదలకు నివాస వసతి కల్పించాలనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన గబ్బిలాల పేట బస్తీలో గల కమిటీ హాల్ స్థలం కబ్జాకు గురవుతుందనే ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని గబ్బిలాలపేట బస్తీ ఏర్పడిన సమయంలో బస్తివాసులు అందరికీ అనుకూలంగా ఉండేందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ హాల్ స్థలం తూర్గొండ రాములు తన సతీమణులు తూర్గొండ విమల తూర్గొండ రమ ల పేర్లపై కరెంటు మీటరు కొన్ని పత్రాలను చేయడం జరిగిందని నాటి నుంచి నేటి వరకు కమిటీ హాల్ కమిటీ కమిటీ హాలుగానే కొనసాగిందని ప్రస్తుతం గబ్బిలాలిపేట ప్రజలు కమిటీ హాల్ స్థలాన్ని తూర్గొండ రాములు అనే నేను నా కుటుంబ సభ్యులు కబ్జా చేస్తామనే అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఇకనుండి గతంలో తన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆధారాలు కరెంటు మీటర్ కానీ ఏ ఇతర పత్రాలు కానీ చెల్లవని కమిటీ హాల్ కమిటీ హాల్ గానే ఉంటుందని ప్రజలందరికీ వినియోగ కరంగా ఉండే ఈ కమిటీ హాల్ ను అధికారికంగా అభివృద్ధి చేయాలని విన్నవిస్తూ స్వయంగా తూర్గొండ రాములు కరాటే రాజు గబ్బిలాల పేట బస్తి వాసులతో కలిసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు
Attachments area