ఆడపడుచుల ఆనందం కోసమే చీరల పంపిణీ.
సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్
ఝరాసంగం సెప్టెంబర్27,(జనంసాక్షి)
దసరా పండగ వేళ ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన ఎల్గోయి గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ అతిపెద్ద పండగ అయిన బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం పండగ జరుపుకోలేక పోతున్నామనే భావన రాకుండా ప్రతి ఆడపడుచుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనరాజ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.