Wednesday, 4 November 2026

ఆడపిల్లల భద్రతలో దేశానికి ఆదర్శం.. మహిళల సురక్షణ సాధికారత స్వావలంబన సంక్షేమమే ధ్యేయం..ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల జూన్ 13(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో బోనాలు బతుకమ్మలు కోలాటాలతో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..కేసిఆర్ ప్రజాపతి మహిళా పక్షపాతి అని మహిళలు, తల్లీ బిడ్డల సంక్షేమమే సమాజ ప్రగతికి తొలి మెట్టు. ఆరోగ్యవంతమైన వ్యక్తుల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఆ సమాజమే పురోగతికి దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి దేశంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టింది. పిల్లలు మరియు తల్లుల్లో పోషణలోపం లేకుండా చేయడానికి వివిధ చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో న్యూట్రిషన్ కిట్స్ నజరానా మహిళల సంక్షేమం, సాధికారత, భద్రతకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ. ఆడపిల్ల కడుపులో పడ్డప్పటి నుంచి తల్లిగా ప్రసవించే వరకు అడుగడుగునా ఆదుకుంటున్న సర్కారు ఈ తెలంగాణ. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, గురుకులాలు, మహిళా డిగ్రి కాలేజీలు, వి హబ్, మహిళల పేరుమీదే ప్రభుత్వ ఇండ్లు, స్థలాల పట్టాలు, మహిళా రిజర్వేషన్లు, అత్యున్నత పదవుల్లో మహిళలకు అగ్రస్థానం అనిన్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ ఒక పెద్దన్నగా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో మేన మామగా, కేసీఆర్ కిట్ ఇస్తూ ఆడబిడ్డలకు ఆప్తుడిగా, మహిళల మీద వేధింపులను నిరోడిస్తున్నం మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూన్నారు.మహిళా సంక్షేమమే సమాజ ప్రగతికి తొలి మెట్టు.
ప్రసవ సమయంలో మాతృ మరణాల రేటు 2014 లో లక్షకు 92 కాగా కాగా ప్రస్తుతం 43కి తగ్గిపోయింది. శిశు మరణాల సంఖ్య 2014 లో వెయ్యికి 35 కాగా ప్రస్తుతం 21 కి గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. మహిళా శ్రేయో రాజ్య స్థాపన దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నరు అని పేర్కన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడం దీని ఉద్దేశ్యం.తల్లీ బిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించే కేసీఆర్ కిట్ పథకాన్ని 2.6.2017 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది.
గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం ద్వారా అర్హులైన వారికి మూడు విడతలుగా మొత్తం రూ.12 వేల రూపాయలను అందిస్తున్నది. ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా మరో 1000 రూపాయలు కలిపి 13 వేల రూపాయలను అందిస్తున్నది ఎమ్మెల్యే అన్నారు. కేసీఆర్ కిట్ల ద్వారా ఇప్పటివరకు 13,90,636 మందికి కిట్లతో పాటు, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది అన్నారు. గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ రక్తహీనత, పౌష్ఠికాహార లోపాలను నియంత్రించేందుకు కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ గొప్ప పథకం అన్నారు. అత్యధికంగా రక్త హీనత ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ ల‌లో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఒక్కో కిట్‌ కోసం రూ. 1962 ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరిగింది. న్యూట్రీషన్ కిట్లు గర్బిణులకు వరంగా మారాయి అనిన్నారు. ప్రభుత్వ ఆుపత్రుల్లో చెకప్ లకు వెళ్లే గర్భిణులు, శిశువులకు సమయానికి రవాణా సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం రూపొందించిందిన్నారు.ఈ పథకం కింద 300 వాహనాలు సమకూర్చింది. ఈ పథకం ఆయా కుటుంబాలకు డబ్బు ఖర్చును తగ్గించడంతో పాటు సురక్షితమైన డెలివరీలకు మార్గం చూపింది. ఆరోగ్యకరమైన ప్రయాణంతో మాతా శిశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచింది.ఈ పథకం ద్వారా మే 2023 వరకు 18,46,635 ద్వారా ఇప్పటివరకు మందికి లబ్ది చేకూరింది. ఈ పథకం కోసం రూ. 172.08 కోట్లు ఖర్చ గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పోషకాలతో సరుకులు ఇవ్వడం జరుగతుంది. భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం, దిగువ సూచికలలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. తెలంగాణ రాష్ట్ర శిశు మరణాల రేటు 2014 నాటికి 39 శాతం నుండి 2020 నాటికి 20 శాతంకి తగ్గింది. తెలంగాణ రాష్ట్ర మాతృ మరణాల రేటు 2014 లో 92 శాతం ఉంటే 2020 నాటికి 43 శాతం తగ్గింది. తక్కువ బరువుతో పుట్టే పిల్లల 2013 లో 18.4 శాతం ఉంటే 2020 నాటికి 13.9 శాతం తగ్గింది. లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు స్త్రీలు,1,007 నుండి1,049కి మెరుగుపడింది. గృహ హింసను అనుభవించిన 18-49 సంవత్సరాల వివాహిత మహిళలు 42 శాతం నుండి 36.9 శాతంకి తగ్గారు. 15-19 సం.ల వయస్సు గల స్త్రీలలో తల్లులు గర్భిణుల శాతం 10.6 శాతం నుండి 5.8 శాతం తగ్గింది. తమ బ్యాంకు లేదా సేవింగ్స్ ఖాతాను ఉపయోగించే మహిళలు 59.5 శాతం నుండి 84.4 శాతంకి మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాలామృతం ప్లస్ 6 నెలల నుండి ఐదేళ్లలోపు పేద పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందించే పథకం బాలామృతం ప్లస్. అనిన్నారు. అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలకు పారితోషికాల పెంపు దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా 13,650 రూపాయల పారితోషికాన్ని చెల్లిస్తున్నది. ఆశా కార్యకర్తలకు 2014 నాటికి 2000 రూపాయలు మాత్రమే ఉన్న పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9750 రూపాయలకు పెంచింది. ఆశా వర్కర్లకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో 3,000 రూపాయలు, గుజరాత్ లో 6,700 రూపాయలు, కర్ణాటక, హర్యానాల్లో 4,000 రూపాయలు, కేరళలో 5,000 రూపాయలు మాత్రమే నెల వేతనంగా ఇస్తున్నారు అని అన్నారు. మహిళాభద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా షిటీమ్ లను ఏర్పాటుచేసింది. ఈ బృందాలు ఈవ్ టీజింగ్ అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లను కట్టడి చేస్తున్నాము అన్నారు. అక్రెడిటేషన్లలో మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. మహిళా జర్నలిస్టుల శిక్షణ కోసం తెలంగాణ ప్రెస్ అకాడమీ ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ, సామర్థ్యాలను కలిగిన మహిళా జర్నలిస్టులను గుర్తించి, వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు అందిస్తోంది అని అన్నారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలైన పేద ఎస్సీ మహిళా లబ్ధిదారులకు 100% సబ్సిడీతో ఒక పంట సంవత్సరానికి పంటసాయంతోపాటు 3 ఎకరాల భూమిని అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. హైదరాబాద్ లోని కోకాపేట్ లో బర్హానా షా సాహిబ్ ఖిబ్లా పరిసరాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, మహిళా సాధికారత కేంద్రం స్థాపనకు ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం వీ హబ్, 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాదులోని అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు అని కొనియాడారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం “ఆరోగ్య మహిళ” అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో వంద దవాఖానాలలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలవుతున్నది. భవిష్యత్తులో మరో 1200 దవాఖానాల్లో ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ మహిళా దవాఖానాలు ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే పని చేస్తాయి. ఇందులో అటెండర్ నుంచి వైద్యుల వరకూ అంతా మహిళలే ఉంటారు.మహిళలు తమ ఆరోగ్య సమస్యలను సత్వరం
పరిష్కరించుకోవచ్చు. వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు కూడా అందజేస్తారు. ఇలా మహిళల సర్వోన్నతి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి పాలనలో దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి, భద్రతా పథకాలు తీసుకొచ్చి అమలు చేయడం జరుగుతోంది. మహిళల అభ్యున్నతే మానవ అభ్యున్నతిగా పనిచేస్తున్నరు మన కెసిఆర్ గారు అని అన్నారు,ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు మహిళలు గొప్పగా జరుపుకునే సంబరాల పండుగ ఇది అనిన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చైర్మన్ మాలతి కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, మొయినాబాద్ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ప్రభుత్వ వైద్య అధికారుల, ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్స్ గారు,మహిళా సంఘాలు, ముఖ్య నాయకులు,ప్రజప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, బిఆర్అఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.