ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ
చెక్కుల పంపిణీలో నాల్చర్ రాజు
బిచ్కుంద నవంబర్ 29 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల ఖత్గాం గ్రామంలో మంగళవారం నాడు లబ్ధిదారులకు ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ నాల్చర్ భారతీ రాజు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హన్మండ్లు, తెరాస మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్ మరియు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ




