నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్ : ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకై ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశపెట్టిందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ప్రజాప్రతినిధులను, అధికారులను ఎమ్మెల్యే సైదిరెడ్డి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ,ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలను, ప్రారంభించామని, గర్భిణీల కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని,మహిళల రక్షణ కోసం షీ టీమ్స్,ఆడపిల్లల పెళ్లి కోసం,కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రి గా పెంపుకు కృషి చేస్తానని, పాలక వీడు మండల కేంద్రంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మారుస్తామమ్మన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు, మున్సిపాలిటీ నూతన భవనానికి నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ చందమళ్ళ జయబాబు, నేరేడుచర్ల ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి,పాలక వీడు ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్,జెడ్పీటీసీ రాపోలు నరసయ్య,జిల్లా వైద్య శాఖ ప్రోగ్రామ్ అధికారి సాహితీ,మండల వైద్యాధికారి పన్నా నాగిని, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,నేరేడుచర్ల,పాలక వీడు, తహశీల్దార్లు సరిత,శ్రీదేవి,ఎంపిడివో శంకరయ్య,డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, గ్రంథాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ,వైద్య సిబ్బంది,ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.




