ఆత్మగౌరవ లోగిళ్లు మన డబుల్ బెడ్ రూం ఇండ్లు
అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు
నిరుపేదలకు దక్కలన్నదే సీఎం కేసీఆర్ గారి ఆలోచన
త్వరలో సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు
పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగింది అని శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో రూ.1.88కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 30 ఇండ్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు పట్టాలను చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవ లోగిళ్లు మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని ఆయన తెలిపారు అభివృద్ధి ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని ఆయన అన్నారు గత ప్రభుత్వాలు ఇరుకు గదులు మి ఇబ్బందులతో కూడిన నిధులు అతి తక్కువ వ్యయంతో అరకొర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా సిఎం కెసిఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆయన తెలిపారు
ప్రభుత్వమే సొంతంగా నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నదని ఆయన అన్నారు ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆయన చెప్పారు ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా పని చేస్తుంది అని ఆయన తెలిపారు
అభివృద్ధి-సంక్షేమాలే రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారని అని అన్నారు.పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం అమలు చేయడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు