Tuesday, 3 November 2026

పేదల గుడిసెలపై టిఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యం దారుణం

పేదల గుడిసెలపై టిఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యం దారుణం

– ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
– ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయ రెడ్డి
ఖైరతాబాద్ : జూలై 22 : ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో గల అంబేద్కర్ నగర్ బస్తీలో దాదాపు 150 కుటుంబాలు గత 35 సంవత్సరాల నుండి అక్కడే ఇండ్లు కట్టుకొని, గుడిసెలు వేసుకుని నల్ల, కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ స్థలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వారు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తామని కానీ అందులో 92 మందికే ఇండ్లు వస్తాయని తెలుపగా అక్కడి స్థానికులు మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వద్దు మా స్థలంలో మేమే ఇండ్లు కట్టుకుంటామని దానిని వ్యతిరేకించడం జరిగింది. ఈ మధ్యనే ఒక ఇంటిపై రాళ్లు పడి ఇల్లు కూలిపోగా వారందరూ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కలవడం జరిగింది. ఎమ్మెల్యేను కలిసిన తర్వాత శుక్రవారం ఉదయం రెవెన్యూ, పోలీసు సిబ్బంది వచ్చి జెసిబిలతో ఆ ఇండ్లను తొలగించే ప్రయత్నంలో భాగంగా స్థానిక ప్రజలకు, రెవెన్యూ పోలీస్ అధికారుల మధ్య గొడవ జరిగింది. స్థానిక ప్రజల పోలీసులు చితకబాదారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ పి.విజయ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు టిఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసుకుంటూ ఇష్టం లేకున్నా పేదల ఇండ్లు కూల్చివేసి అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయని అక్కడ నిర్మించి ఇవ్వాలని విజయ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.