ఆదర్శవంతమైన అభివృద్ద్యే లక్ష్యంగా పనిచేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ ఆగస్టు 1 జనం సాక్షి
గ్రామాల్లో ఆదర్శవంతమైన అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దామని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం మంజూరైన నిధుల ప్రొసీడింగ్లో అందజేశారుఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మరియు గ్రామాల అభివృద్ధికి .8,86,50,000ఎనిమిది కోట్ల యేనభై ఆరు లక్షల యాభై వేలు నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మర్పల్లి జెడ్పిటిసి మధుకర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి సర్పంచులు గౌస్ ఉద్దీన్ ఫకీర్ షాప్ సర్పంచులు ఎంపిటిసి సభ్యులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.