ఆదికవి వాల్మీకి మహర్షి భవన నిర్మాణం చేపట్టాలి.
వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ వాల్మీకి బోయ అశోక్ కుమార్.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)ఆదికవి మహర్షి వాల్మీకి, ప్రపంచ మహా పురుషుడు ,రామాయణ గ్రంథ సృష్టికర్త వాల్మీకి భవనం హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించాలని వాల్మీకి బోయలు డిమాండ్ చేశారు. మొన్న హైదరాబాదులో బంజారా భవనం నిర్మించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, మహర్షి వాల్మీకి భవనంతో పాటు విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వాల్మీకి మహర్షి భవనాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్ నివేదికను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.