Wednesday, 4 November 2026

ఆదినాథస్వామి రథోత్సవంలో చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి

జక్రాన్‌పల్లి : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో నిర్వహించిన ఆదినాథస్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన రధోత్సవంలో జైడి మల్లేశ్‌(40) అనే వ్యక్తి రధాన్ని లాగుతూ అదుపుతప్పి చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే నిజామాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *