Wednesday, 4 November 2026

ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్‌: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను పరీశీలించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.40 నిమిషాలకు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి  హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ చేరుకుంటారు. అండెవెల్లి గ్రామాన్ని సందర్శంచి బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం కాగజ్‌నగర్‌ పట్టణంలోని నవేగావ్‌ బస్తీలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లాకు చేరుకుని జగిత్యాల మండలం తాటిపల్లి శివారు గ్రామంలో రైతులను కలిసి పంట నష్టంపై ఆరా తీస్తారు. మేడిపల్లి మండలం, కాట్లకుంట, కోరుట్ల, జోగనపల్లి గ్రామాల్లో మొక్కజొన్న, మామిడి పంట నష్టాలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని తిరిగి గన్నవరం బయలుదేరుతారు. సాయంత్రానికి హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం చేరుకుంటారు. సాయంత్రం ఏడుగంటలకు కిమ్స్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *