రెండ్రోజుల పాటు మద్యం దుకాణాల మూసివేత
హైదరాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): హైదరాబాద్ బోనాలను పురస్కరించుకుని నగరంలో మద్యం దుకాణాలన మఊసివేతకు పోలీసులు ఆదేశించారు. బోనాల కారణంగా ఆది, సోమవారాల్లో భాగ్యనగరంలో మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. నగరవ్యాప్తంగా పలు అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం, సోమవారాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బార్లు, పబ్బులను కూడా మూసివేయాలని ఆదేశించారు. అయితే, స్టార్ ¬టళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసుల ఆదేశాలు కాదని మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




