Tuesday, 3 November 2026

ఆధార్‌ గడువు మరో మూడు నెలల పెంచాలి

హైదరాబాద్‌ : ఆధార్‌కార్డు గడువు మరో మూడు నెలలు పెంచాలని కేంద్రామంత్రి వయలార్‌రవికి లేఖరాసినట్లు రాష్ట్ర కార్మికశాఖామంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో పొదుపు సంఘాల మహిళలతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇండ్లలో పనిచేసే వారికి రాష్ట్రీయ స్వస్తీబీమా యోజన పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సూచన మేరకు అభయహస్తం పేద ప్రజలందరికీ సద్వినియోగం చేసే విధంగా పొదుపు సంఘాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు దానం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *