హైదరాబాద్ : మార్చి నెలలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. వచ్చేనెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలోనే ఈ కార్యక్రమం వుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై ఐకాస సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైఖ్యవాదానికి మద్దతు లేదని తెలిసినా కాంగ్రెస్ నాటకమాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీని వదిలి ప్రజా ఉద్యమంలోని రావాలని పిలుపునిస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ నెల 16 నుంచి 21 వరుకు కాంగ్రెస్ శాసనసభ్యుల నియోజకవర్గాలో ప్రచారం నిర్వహించనున్నట్టు ఆయన విల్లడించారు. 24 గంటల పాటు బెంగుళూరు. విజయవాడ జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని కోదండరాం తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి, మార్చి 2న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్టు ఐకాస సహ సమన్వయకర్త శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు జాతీయ రహదారిపై బస్సుయాత్ర, ఈ నెల 27, 28 తేదీల్లో హయత్‌నగర్‌నుంచి కోదాడ విజయవాడ రహదారిపై బస్సుయాత్ర నిర్వాహించనున్నట్టు ఆయన తెలిపారు.




