Monday, 2 November 2026

ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్టు30 ): హైదరాబాద్‌ నగరంలో ఆన్‌లైన్‌ లాటరీ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేరళ యువకుడు హంజాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.కోటి లాటరీ పేరుతో హంజా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.11 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.