ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ- సేవలు అందించాలి

నల్లబెల్లి అక్టోబర్ 8 (జనం సాక్షి):
పంచాయతీ కార్యదర్శులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ సేవలో అందించాలని మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నల్లబెల్లి ,చెన్నారావుపేట మండలాలలోనీ పంచాయతీ కార్యదర్శులకు గ్రామాలలో ఈ సేవలు అందించే పద్ధతులు, వాటి యొక్క వివరాలు ఆన్ లైన్ లో ఎలా నమోదు చేయాలో ప్రాజెక్టు ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎంపివో మాట్లాడుతూ బిల్డింగ్ పర్మిషన్లు, ట్రేడ్ లైసెన్సులు, జనన మరణాల ధ్రువీకరణ పత్రాలు, బిల్డింగ్ వేల్యూషన్ సర్టిఫికెట్స్ లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సుధాకర్ , పద్మనాభ స్వామి, జ్యోతి ,రజిత ,శాంత ,శ్రావణ్ ,అనిత , మౌనిక ,రహీం ,సురేష్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్లు రజినీకాంత్ ,రఘువరన్ పాల్గొన్నారు.
Attachments area