*యాలాల్ మండల బిసి సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి ఆధ్వర్యంలో తుల్జాపూర్ కు పాదయాత్ర*

యాలాల్ అక్టోబర్ 8  ( జనం సాక్షి ) : యాలాల మండల జుంటుపల్లి, యాలాల్, చెన్నారం, తాండూర్ తదితర గ్రామాల కు చెందిన యువకులు యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి ఆధ్వర్యంలో సోలాపూర్ నుండి తుల్జాపూర్ వరకు  పాదయాత్ర చేపట్టారు. ఇట్టి పాదయాత్రలో 20 మంది యువభక్త బృందము తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి బయలుదేరి వెళ్లారు. గోపాల్, ప్రవీణ్, ప్రశాంత్, శాంత్ కుమార్, ప్రకాష్, అరవింద్, కాశీనాథ్, అరుణ్, అంబాదాస్, ఆకాష్ మరియు మహిళా భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.