Sunday, 8 November 2026

ఆపదలో ఆదుకున్న వనపర్తి సేవా దళం ట్రస్ట్ చైర్మన్ వనపర్తి లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ సెప్టెంబర్ 11 ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘం పరిధిలో గల సాలార్జుంగ్ పేట కి చెందిన షేక్ జానిమియ  వృతి రీత్యా రైస్ మిల్ లో హమాలిగా పనిచేస్తూ,కొంత కాలం కిందట ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి పడి తన రెండు కాళ్ళ కు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. దీనివలన పనికి వేళ్ళలేక పోవడంతో,ఆర్థిక పరంగా బాగా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెల్సుకున్న వనపర్తి సేవా దళం ట్రస్ట్ చైర్మన్,శ్రీ వనపర్తి లక్ష్మీనారాయణ  వారి సభ్యులతో చర్చించి వారికి ఆర్ధిక సహాయం చెయ్యడం జరిగినది.ఈ కార్యక్రమంలో వీరితో పాటు వనపర్తి సేవా దళం ట్రస్ట్ సభ్యులు షేక్. మధార్ సాహెబ్,మరియు గ్రామ సభ్యులు రహీమ్, షకీల్,అసిఫ్,సైదులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area