మృతుడి కుటుంబానికి పరామర్శ……

టేకుమట్ల.సెప్టెంబర్11(జనం సాక్షి) మండలంలోని ఎంపేడు గ్రామంలో అందరి ఆత్మీయు సోదరులు పొనగంటి బాబు(గ్రామ రెవెన్యూ సహాయకులు) ప్రభుత్వ ఉపాధ్యాయుడు సదయ్య తండ్రి పొనగంటి నర్సయ్య ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న  ప్రముఖ సినిగేయ రచయత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్,ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు సంగి రవి, మృతుడి కుటుంబ సభ్యులను కలిసి మృతుడి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.పరామర్శించిన వారిలో ఏం పేడు  సర్పంచ్ కొలిపాక రాజయ్య,ఓయూ విద్యార్థి లీడర్ నలిగంటి శరత్,ఓరుగంటి సధాకర్ గౌడ్,దళిత రత్నా అవార్డు గ్రహీత అంబాల ప్రభు,తెలంగాణ సారధి కళాకారులు గోల్కొండ బిక్షపతి,తుమ్మనపల్లి రాజు,రహీమ్,అరె దేవేందర్, కుమార్,పాల శంకర్,మిట్టపల్లి బాలు,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.