లైగర్‌ నుంచి విజయ్‌ పాడిన పాట విడుదల

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం నటించిన చిత్రం ’లైగర్‌’. ఈ సినిమాను కరణ్‌ జోహర్‌, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్‌ గా విడుదల
కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌తో ప్రేక్షకులలో ఆసక్తిరేపుతున్నారు. తాజాగా ’వాట్‌ లగా దేంగే’ అనే లైగర్‌ వీడియో సాంగ్‌ ను విడుదల చేశారు. ఈ పాటను విజయ్‌ స్వయంగా పాడడం విశేషం. దీనికి పూరి సాహిత్యం అందించాడు. సాంగ్‌ ఆద్యంతం పూరి మార్క్‌ మాసిజం కనిపించింది. కిక్‌ బాక్సర్‌ గా మిక్స్‌ డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్టుగా కనిపిస్తున్న దేవరకొండ ఇండియా కోసం ఎంతకైనా తెగిస్తాడనే సందేశం ఈ సాంగ్‌ లో తెలుస్తోంది. ఈ మూవీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.