Wednesday, 4 November 2026

ఆమెవన్నీ అసత్య ఆరోపణలే: శంకర్‌రావు

హైదరాబాద్‌ : తన కోడలంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి శంకర్‌రావు ఖండించారు. మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్‌తో వెళ్లిపోయిన అమె తనపై అసత్వ అరోపణలు చేస్తోందని శంకర్‌రావు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై తాను స్పందిస్తుంన్నందుకు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకే అధికార పక్షంలోని కొందరు నేతలు తనపై కక్షగట్టారని శంకర్‌రావు ముఖ్యమంత్రినుద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. తనపై ఇదే చర్యలు కొనసాగితే తెలంగాణలో పార్టీ భూస్థాపితం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *