హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున సత్‌ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు. మిగిలినవారికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష మినహాయింపు ఇవ్వాలని సూచించారు. తన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు కూనంనేని తెలిపారు.




