:దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి.
దౌల్తాబాద్ జూలై 15, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రనికి చెందిన రైతు
జిల్లా కోఆప్షన్ రహీముద్దీన్ తనకున్న సొంత పట్టా భూమి ఏడున్నర ఎకరాలలో ఈరోజు ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం ప్రారంభించిన జడ్పిటిసి రణం జ్యోతి
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటలతో రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే పంట కాబట్టి దీనిని అందరూ రైతులు వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆయిల్ పంటల సాగు చేయాలని సూచించారు. ఈ పంటకు సంబంధించి డ్రిప్పును గాని మొక్కలను గాని ఇక్కడ ఈ తోటలో పనిచేసే కూలీలను ను గానీ పూర్తిస్థాయిలో సబ్సిడీ అందేయడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్,వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి,ఏ ఈ ఓ లు ప్రవీణ్,సంతోష్ లు టిఆర్ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, కలియులోద్దీన్,స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.




