ఆయుష్ వైద్య శిబిరానికి విశేష స్పందన
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడాటి పల్లెలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయుష్షు మొలగూర్ వైద్యశాల అధికారి సంధ్యారాణి మాట్లాడారు. ఆయుష్ రీజనల్ డైరెక్టర్ బి రవి నాయక్ ఆదేశం మేరకు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో గల ఆయుష్ వైద్యశాల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలోని గులాటి పల్లెలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుష్ మందులను అందజేసినట్లు వైద్య అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.