పోలీసులను విచారించనున్న సిబిఐ
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): అయేషా విూరా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయేషా విూరా కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలనే ఆలోచనలో సీబీఐ ఉంది. కేసులో తనను పోలీసులు కావాలని ఇరికించారని ఇప్పటికే కేసులో శిక్ష పడి విడుదలైన సత్యంబాబు ఆరోపణలు చేసాడు. ఇక హత్య జరిగి 11 ఏళ్ళు గడవటం, కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావటంతో అప్పటి పోలీసులను దర్యాప్తు కోసం ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇప్పటికే 15 మందితో కూడిన పోలీస్ అధికారుల జాబితాను సిద్ధం చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసుల నుంచి వచ్చే వివరాలు కేసుకు పురోగతికి పనికి వస్తాయని సీబీఐ భావిస్తోంది.




