ఖైరతాబాద్ : జూలై 23 (జనం సాక్షి) మ్యాట్ రీవ్స్ రచన దర్శకత్వంలో(వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, క్లోవర్ ఫీల్డ్)రూపొందించిన రీవ్స్ డైలాన్ క్లార్క్ నిర్మించిన ‘ది బ్యాట్‌మాన్'(2022) చిత్రం విడుదల తేదీని ప్రైమ్ వీడియో శనివారం ప్రకటించింది. ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ది బ్యాట్‌మ్యాన్ డీసీ పాత్రల ఆధారంగా రీవ్స్, పీటర్ క్రెయిగ్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి దర్శకుడు మ్యాట్ రీవ్స్(ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్) బాట్‌మ్యాన్‌ను బిల్ ఫింగర్‌తో కలిసి బాబ్ కేన్ సృష్టించారు. డైలాన్ క్లార్క్(ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రాలు) రీవ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైఖేల్ ఈ ఉస్లాన్, వాల్టర్ హమదా, చాంటల్ నాంగ్ వో, సైమన్ ఇమాన్యుయెల్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. 6వ, ఇడాహో/డైలాన్ క్లార్క్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్, మ్యాట్ రీవ్స్ ఫిల్మ్ ‘ది బాట్‌మాన్’ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సమర్పిస్తోంది.




