ఆరోగ్యమే మహాభాగ్యం.
గుండెను పదిలంగా ఉంచుకుందాం. జీవితాన్ని పెంపొందించుకుందాం.
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బాలేశ్వర గుప్త.
తాండూరు జులై31(జనంసాక్షి)గుండె పదిలంగా ఉన్నప్పుడే… జీవితం పదిలంగా ఉంటుందని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బాలేశ్వర గుప్త అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో తాండూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషి ఆరోగ్యానికి ప్రధాన కారణం గుండె మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరు గుండెను పదిలంగా ఉంచుకుంటే వారి జీవితం మరింత సాఫీగా ముందుకు సాగి వారి జీవన ప్రమాణం పెరుగుతుందన్నారు. పరిసర ప్రాంత ఆర్యవైశ్యులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో ఆర్యవైశ్యుల కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించా మన్నారు.భవిష్యత్తులో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలను మరిన్ని కొనసాగించ నున్నామన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.