ఆరోగ్యశ్రీ ద్వారా విరిగిన ఎముకలకు ఉచిత ఆపరేషన్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల హెల్తీ ఫై హాస్పిటల్ నందు ఏదైనా ప్రమాదవశాత్తు విరిగిన ఎముకలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు హెడ్ ఆఫ్ ద హెల్తీ ఫై హాస్పిటల్ మతకాల చలపతిరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థోస్కోపిక్ , కీళ్ల మార్పిడి అతి తక్కువ ఖర్చుతో చేయనున్నట్లు చెప్పారు.ఆరోగ్య శ్రీ , వైట్ రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్స్
9949641757, 77990 09581 లలో సంప్రదించాలని అన్నారు.