ఆరోగ్య ఉప కేంద్రం నిర్మించాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 10 : చేర్యాల మండలంలోని కడవెరుగు గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించాలని సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. 3వేల ఐదు వందల జనాభా కలిగి ఉన్న పెద్ద గ్రామ పంచాయతీగా కలిగి ఉన్న కడవేరుగులో ఆరోగ్య ఉప కేంద్రానికి నూతన భవనం మంజూరు చేసి నిర్మించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పొనుగోటి శ్రీనివాస్ రెడ్డి, కత్తుల నరసింహారెడ్డి, ఆరుట్ల లింగం తదితరులు పాల్గొన్నారు.