ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ అక్టోబర్ 17( జనంసాక్షి) న్యాలకల్ మండలం లోని ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడించారు. వడ్డీ గ్రామం నుండి స్థానిక ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లడం జరిగింది. గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎంపీడీవో ఏ ఈ లకు వినతి పత్రం ఇచ్చి ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. వెంటనే స్థానిక ఏ ఈ వెంటనే పరిశీలించి న్యాలకల్ మండలం ఆస్పత్రి సిబ్బందికి వడ్డీ గ్రామంలోని ఆరోగ్య కేంద్రం భవనాన్ని హ్యాండ్ ఆవర్ చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఆనంద్ ఈశ్వర్ ఉమేష్ మోషన్ పటేల్ విజయ్ కుమార్ అజయ్ కుమార్ సాగర్ సఫియా యాదుల్ శివకుమార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.