జంటా జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల వైఫల్యం
హైదరాబాద్, సిటిబ్యూరో: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో హైదరాబాద్ జిల్లా గతేడాది కన్నా ఓ మెట్టెక్కి ఆరో స్థానానికి ఎగబాకింది. ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినా రాష్ట్రస్థాయిలో స్థానం మాత్రం మెరుగువడం విశేషం. ఇక రంగారెడ్డి జిల్లా ముచ్చటగా మూడోమారు కూడా మూడో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతం గతేడాది కన్నా స్వల్పంగా మెరుగుపడింది. రెండు జిల్లాలలోనూ అఅమ్మాయిలు తమ ప్రతిభను చాటారు. హైదరాబాద్ జిల్లాలో 64,017 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 35,162 మంది (54.92శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 46.54 శాతం; బాలికలు 63.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాలో 97,474 మంది విధ్యార్థులకుగాను 62,164 మంది (63.77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 60.03 శాతం,బాలికలు 68.40 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటరు. వృత్తి విద్యా కోర్సులలో గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో 50 శాతం (గతేడాది 36 శాతం) మంది వొకేషనల్ విద్యార్థులు ఉత్తీరుఐలు కాగా, రంగారెడ్డి జిల్లాలో 43.15 శాతం (గతేడాది 35 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధాంచారు.
ప్రభుత్వ కళాశాలలో పడిపోయిన ఫలితాలు:-
జంట జిల్లాలలోని పలు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ఫలితాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్ జిల్లాలో బన్సీలాల్ బాలిక జూనియర్ కళాశాల (66.67 శాతం), మారేడ్‌పల్లిలోని కేజీ జూనియార్ కాలేజి(55.42శాతం), గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కళాశాల(54.35 శాతం), మైసారం గవర్నమెంట్ జూనియార్ కాలేజి (53.96) మినహా మిగిలిన 36 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు కనీసం 50శాతం ఉత్తీర్ణత మార్కుకు చేరలేకపోయాయి. రంగారెడ్డి జిల్లాలలో 24 ప్రభుత్వ కళాశాలలో నవాబ్‌పేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(64 శాతం), రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (50 శాతం) మినహా మిగిలిన 22 కళాశాలలు ఆధ్వాన ఫలితాలే మూటగట్టుకున్నాయి. కనీసం 35 శాతం ఉత్తీర్ణత కూడా సాధించని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు హైదరాబాద్ జిల్లాలో 25 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15కళాశాలు ఉన్నాయి.
సిటి కన్నా శివారు మిన్న:-
గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాలలో సిటీ కన్నా శివారే ముందు నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్ జిల్లా 54.92 శాతం ఉత్తీర్ణత సాధించగా, రంగారెడ్డి జిల్లాకు 63.77 శాతం ఉత్తీర్ణత లభించడమే ఇందుకు నిదర్శనం. శివారు కన్నా సిటీ వెనుకబడటానికి ప్రధాన కారణం కార్పొరేట్ విద్యాసంస్థలేనన్నది సుస్పష్టం. హైదరాబాద్ జిల్లాలో 30 నుంచి 40 వరకు కార్పొరేట్ కళాశాలలు ఉండగా శివారు ప్రాంతాలలో 60 నుంచి 70 వరకు ఉన్నాయి. సిటీ కళాశాలలో ఎక్కువమంది విద్యార్థులు డేస్కాలర్స్ కావడం, శివారులోని కళాశాలలు, విద్యార్థులకు హాస్టల్ వసతి, సదుపాయాలు కల్పిస్తుండడం కూడా మరో కారణం. శివారు కన్నా సిటీలోనే ఎక్కువగా మురికివాడలు ఉండడం, ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై అంతగా శ్రద్ధ కనబర్చడంలేదని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ/ఎయిడెడ్ కళాశాలలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత, కాంట్రాక్టు అధ్యాపకులతో భోదన వంటి సమస్యలు ఇంటర్ ఫలితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి…




