Thursday, 5 November 2026

ఆర్టీసి డిపోల ముందు టిఎంయూ ఆందోళన

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): టీఎంయూ కార్మిక వ్యతిరేక ఒప్పందానికి నిరసనగా అన్ని ఆర్టీసీ డిపోల ఎదట తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే డిపోలకు చేరుకున్న యూనియన్‌ సభ్యులు నల్లబ్యాడ్జిలతో నిరసన ప్రదర్శనకు దిగారు. అలాగే టీఎంయూ దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్త వేతనాల విషయంలో కార్మికులను టీఎంయూ నట్టేట ముంచిందనిఆరోపిస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) ఈరోజు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.