ఏసీబీ వలలో మున్సిపల్ డీఈఈ
శ్రీకాకుళం,జూన్11(జనం సాక్షి): ఏసీబీ వలలో మరో ప్రభుత్వాధికారి చిక్కాడు. మున్సిపల్ డీఈఈ శ్రీనివాసరాజు నివాసంలో ఏసీబీ సోమవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ, భీమవరం, పాలకొల్లు సహా ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు రూ.20కోట్ల అక్రమాస్తులు గుర్తించారు.సీతమ్మధారలోని శ్రీనివాసరాజు ఇంట్లో రూ.12.50లక్షలు, 150 గ్రాముల బంగారం, కిలో వెండిని గుర్తించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలిలో 32 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, విశాఖలోని నార్త్ ఎక్స్‌టెన్షన్ కాలనీలో 183 సెంట్ల స్థలం, సీతమ్మధారలోని ఆర్‌ఆర్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్, రెండు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు కొనసాగుతున్నాయి.