Wednesday, 4 November 2026

ఆర్టీసీ కార్మికుల ఆందోళన: బస్‌భవన్‌ ముట్టడి

హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  డిమాండ్ల సాధనకు సోమవారం  ‘చలో బస్‌భవన్‌’ను చేపట్టారు. కార్మికుల సమస్యల పరిస్కారంలో ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని  టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి వీసీఎస్‌రెడ్డి అన్నారు. దీంతో ఆర్టీసీలో సమ్మెకు  కార్మికులకు పిలుపునిచ్చారు. దీంతో బస్‌భవన్‌ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల వేతన సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని టీఎంయూ డిమాండ్‌ చేస్తోంది. 2017, ఏప్రిల్‌ నుంచి రావాల్సిన పే స్కేల్‌ను అమలు చేయాలన్న డిమాండ్‌తో ‘చలో బస్‌భవన్‌’ నిర్వహిస్తున్నట్లు వీసీఎస్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్‌భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరించారు.