ఆస్పత్రిలో చికిత్స
బర్కత్‌పురా డిపోముందు ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్,జూలై4(జనం సాక్షి ): నగరంలోని బర్కత్‌పుర డిపో మేనేజర్ శంకర్ నాయక్ వేధిస్తున్నారంటూ వీరేశం అనే డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని డిపోకు చేరుకున్న వీరేశం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేశాడు. గమనించిన తోటి సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరేశం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మేనేజర్ తీరుకు వ్యతిరేకంగా బుధవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. బస్సులు బయటికి రానీయకుండా అడ్డుకున్నారు. విధుల పేరిట తమను వేధింపులకు గురిచేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్ వ్యక్తిగత సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మహిళా కార్మికులు కంటతడి పెట్టారు. డిపో మేనేజర్ శంకర్ నాయక్, ఎస్‌టీఐ అలీ తీవ్రంగా వేధించడంతో వీరేశం మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా డిపో మేనేజర్ అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని డిపోల్లో 120 కిలోవిూటర్ల నియమం ఉండగా.. ఈ డిపో మేనేజర్ మాత్రం తప్పనిసరిగా 145 కిలోవిూటర్ల నడపాల్సిందేనని, కేఎంపీఎల్ పాటించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. టా/-గ్గం/ట్ ఏ మాత్రం తగ్గినా డ్రైవర్లకు ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. బర్కత్ పురా డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు.




