ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల కమిటీ ఏర్పాటు
బాన్స్‌వాడ: బాన్స్‌వాడ ఆర్టీసీ డిపొ పరిధిలోని కార్మికులు సోమవారం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాలు బస్టాండు వద్ద ఆగకుండా చర్యలు తీసుకున్నారు. డిపొ మేనేజరు అనీల్‌కుమార్ ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రారంభించారు. నిబంధనల మేరకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ప్రయాణ ప్రాంగణానికి కిమీ దూరంలో నిలపాలని, అయితే ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోకపోవటంతో కార్మికులే కమిటీగా ఏర్పడి ప్రయాణ ప్రాంగణం పరిసరాల్లో ఆటోలు నిలపకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. శెలవుల్లో ఉన్న కార్మికులు ఈ కమిటీలో ఉంది ఉచిత సేవలందిస్తారని డీఎం చెప్పారు.