Wednesday, 4 November 2026

ఆర్టీసీ సమ్మెపై కార్మిక నేతల చర్చలు

భవిష్యత్‌ కార్యాచరణపై మంతనాలు

హైదరాబాద్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : ఆర్టీసీ సమ్మె విషయంలో ఏం చేయాలన్నదానిపై మంగళవారం హైదరాబాద్‌లో టీఎంయూ నేతలు భేటీ అయ్యారు. సమ్మె సంగతి లేబర్‌ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేయడంతో టీఎంయూ నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. కాగా ఇవాళ నిర్వహించాల్సిన సడక్‌ బంద్‌ను ఆర్టీసీ కార్మికులు వాయిదా వేశారు. 46 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు ఎంతో దీక్షతో, పట్టుదలతో సమ్మె చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిగిరాకపోవడం, హైకోర్టు కూడా లేబర్‌ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసిన నేపథ్యంలో టీఎంయూ నేతల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రభుత్వం కూడా కార్మిక సంఘాల స్పందనను బట్టే ప్రతిస్పందించాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది.