ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ

భద్రాచలం పట్టణం: భద్రాచలం ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు డ్రైవర్లు, కండక్టరకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీటీవో నరసయ్య డిపో మేనేజరు జేవీ బాబు మాట్లాడుతూ ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కార్మికులకు సూచించారు. క్రమశిక్షణతో కూడిన వృత్తి నైపుణ్యం సంస్థ అభివృద్ధి కి దోహద పడుతుందని వివరించారు.