* ఆర్థిక‌నేర‌గాళ్ల చేతిలో దేశ సంప‌ద‌

మోడీ పాల‌న‌పై విసిగెత్తిపోతున్న జ‌నం

* దేశంలో పేదోళ్ల‌కు మంచినీళ్లు క‌రువు

* మునుగోడు సభలో అమిత్ షా సమాధానం చెప్పాలి

* ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ రాష్ట ఉపాధ్య‌క్షుడు అంబ‌టి జోజిరెడ్డి

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
దేశ సంప‌దంతా మోడీ మిత్రులైన ఆర్థిక నేర‌గాళ్ల చేతిలోకి వెల్లిపోయింద‌ని, 150ల‌క్ష‌ల కోట్లు దోసుకెళ్లార‌ని ఆ డ‌బ్బంతా వెన‌క్కి తీసుకురావాల‌ని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ రాష్ట ఉపాధ్య‌క్షుడు అంబ‌టి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. క‌రీంన‌గ‌ర్‌లో ఆయ‌న మాట్లాడుతూ బిజెపి ప్ర‌భుత్వంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆర్థిక నేర‌గాళ్ల‌కు రెడ్ కార్ఫెట్ వేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బిజెపి పాదయాత్ర లో భాగంగా ఈ నెల22న మునుగోడు లో బిజెపి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు
సభకు వస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని జోజిరెడ్డి డిమాండ్ చేశారు.
ఆరు నెల‌ల పిల్ల‌గాడికి క‌డుపునిండా పాలు ఇవ్వ‌ని పేద త‌ల్లులు దేశంలో ఎంద‌రో ఉన్నార‌ని, క‌నీసం పిల్లోడికి పెన్సిల్ కూడా కొన్నివ్వ‌ని దుస్త‌తి ఉంద‌న్నారు. బిజెపి పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని,ఇటీవ‌ల ఆ ప‌రిణామం ఝార్మండ్ విధాన‌స‌భ‌లో వ‌చ్చిన మార్ఫ‌ను చ‌వి చూశామ‌న్నారు. అదే ప‌రిస్త‌తి దేశ‌మంతా వ్యాపించ‌క త‌ప్ప‌ద‌న్నారు. దేశంలో రాజ‌కీయ మార్ఫు, ప్ర‌భుత్వ మార్ఫును జ‌నం కోరుకుంటున్నార‌ని అన్నారు.
నిరు పేద‌ల‌కు ఉచితంగా రేష‌న్ బియ్యం ఇస్తున్నారు. ఇది బిజెపి ప్ర‌భుత్వం చేప‌ట్టిన బృహ‌త్త‌ర కార్యక్రమం అని జ‌బ్బ‌లు చ‌ర్చుకుంటున్నకేంద్ర స‌ర్కారుకు ఆర్థిక నేర‌గాళ్ల‌తో దోస్తి ఎంద‌కని ప్ర‌శ్నించారు.
మొహుల్ చోక్సి, రిఫి అగ‌ర్వాల్ లాంటి ఆర్థిక నేర‌గాళ్లకు చెందిన 10 ల‌క్ష‌ల కోట్లు రుణాల‌ను మాఫి చేశారు క‌దా.. దీని సంగ‌తేందని నిల‌దీశారు. దేశ‌మంతా పేద‌ల‌కు ఉచితంగా రేష‌న్ బియ్యం అందిస్తున్న మోడి స‌ర్కారును అభినందించాల్సిందే. కానీ దేశ సంప‌ద ఊడుసుకుపోతే,, దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగుల‌కు ఉద్యోగాలివ్వాలంటే ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బ‌లేవ‌ని చెబుతున్నారు. ఆర్మీలో అగ్నిపథ్ పేరిట యువతకు నాలుగేళ్ల కొలువులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇదేంటీమ‌రీ మీకో న్యాయ‌
మాకో న్యాయ‌మా అని నిల‌దీశారు. ఇటీవ‌ల ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఒక సమావేశంలో
ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ రాజ‌కీయ పార్టీలు ఓట్ల కోసం ఉచిత హామీలు ఇస్తున్నాయ‌ని అన్నారు. ఇది ప్ర‌జా స్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం అన్నారు. ఆయ‌న చెప్పేది ఒక‌టి చేసేదొక‌ట‌ని విమ‌ర్శించారు. బ్యాంకుల‌ను మోసం చేసిన ఆర్థ‌క నేర‌గాళ్లకు చెందిన రూ.10 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌ను ఎందుకు మాఫీ చేశారు అని ప్ర‌శ్నించారు. ఈ ర‌ద్దు ఉచితం కింద‌కు రాదా నెల‌కు 5కిలోల బియ్యం ఇచ్చినందుకు మోడీని అభినందించాల‌ని అంటున్నారు. మ‌రి ఆర్థిక నేర‌ళ్ల‌కు చెందిన రూ.10 ల‌క్ష‌ల కోట్లు రుణాల‌ను ర‌ద్దు చేసినందుకు మోడీని అభినందించాలా లేదా స‌న్మానించాలా అని ప్ర‌శ్నించారు.
గుజరాత్ అల్ల‌ర్ల‌లో ఒక కుటుంబంపై దాడి చేసి ఎడుగురిని హ‌త‌మార్చి, ఒక మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం చేసిన 11 మంది జీవిత ఖైదీల‌ను గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఆది మోడీ చ‌లువ క‌దా అని ప్ర‌శ్నించారు గ‌తంలో ఇందులో ముగ్గురుకి మ‌ర‌ణ శిక్ష కూడా వేయాల‌ని, 7గురికి యావ‌జ్జీవ శిక్ష వేయాల‌ని సిబిఐ బాంబే హైకోర్టుకు అప్పిల్ చేసిన విష‌యం తెలిసిందే. ఈలాంటి వారికి అక్క‌డి బిజెపి ప్ర‌భుత్వం క్ష‌మాబిక్ష పెట్టి విడుద‌ల చేయ‌డంలో ఆంత‌ర్య‌మేంట‌ని నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెబుకుంటూ ఆర్థిక నేర‌గాళ్ల కొమ్ము కాస్తుంద‌ని నిల‌దీశారు. 10 ల‌క్ష‌ల కోట్లు రుణాల‌ను మాఫీ చేసిన భార‌త ప్ర‌భుత్వం ఆర్టీ రిక్రూట్మ్ంట్‌లో యువ‌తకు తీర‌ని అన్యాయం చేస్తోంది. అగ్నిప‌థ్ అనే ప‌థ‌కం పేరిట కేవ‌లం నాలుగు ఏండ్లు నౌక‌రి చేని ఇంటికి పొమ్మంటుంది. ఇదెక్క‌డి న్యాయం. చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌భుత్వం నిరుపేద‌ల‌పై ప‌న్నుల మోత విధిస్తోంది. గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర‌లు పెంచేసింది. పిల్ల‌లు తాగే పాల‌పై కూడా జీఎస్టీ వేటు వేసింది. రైతుల పంట‌ల‌కు న‌స్టం వాటిల్ల‌తే వారిని ఆదుకునే దిక్కులేదు. రైతాంగాన్ని ఆదుకోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వ పూర్తిగా విఫ‌ల‌మైంది. దేశంలో అంత హీన‌మైన ప్ర‌భుత్తాన్ని ఎప్ప‌డూ చూడ‌లేద‌న్నారు. మ‌రి ఈ డ‌బ్బంతా ఎటు పోతోంది. త‌న మిత్రుల వ‌ద్ద‌కు పోతుంద‌ని విమ‌ర్శించారు. 20వేల కోట్లు నిర‌జ్ మోడీ ప‌ట్టుకెళ్లాడు. రూ. 10 వేల కోట్లు విజ‌య్ మాల్యా తీసుకుని పారిపోయిండు. 30 వేల కోట్లు ల‌లిత్‌మోదీ దోసుకెళ్లిండు. 6వేల కోట్లు నితిన్‌స‌మిత్ర ప‌ట్టుకెళ్లాడు. ఇది నా విమ‌ర్శ‌లు కావు బిజెపికి చెందిన ఎంపీలు వెల్ల‌గ‌క్కిన నిజాల‌ని అన్నారు. మోదీ పాల‌న‌లో ఉన్నోడు కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతుంటే లేనోడు మ‌రింత కిందికి దిగ‌దిదిగ‌జారుతున్నాడ‌ని పేర్కొన్నారు. దేశంలో మోడీ మిత్రులంతా ధ‌న‌వంతులుగా మారిపోతున్నారు.
దేశంలో ఆర్థిక నేర‌గాళ్లు దోసుకెళ్లిన డ‌బ్బు వ‌సూళు చేస్తే దేశంలో ప్ర‌తి ఒక్క‌రికి 11 ల‌క్ష‌లు చొప్ప‌న పంచ‌వ‌చ్చ‌ని అన్నారు. మోడీ పాల‌న‌లో ఆర్థిక నేర‌గాళ్లు రావ‌డం కోట్లు కాజేసుకుని పోవ‌డం ప‌రిపాటిగా మారింద‌న్నారు. దేశ సంప‌ద‌లో 150ల‌క్ష‌ల కోట్లు ఆర్థిక నేర‌గాళ్ల వ‌ద్దనే ఉన్నాయ‌న్నారు. ఇలా అయితే దేశ స‌మ‌గ్ర‌త, ప్ర‌గ‌తి ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నించారు. పిల్ల‌గాడు ఏడిస్తే ప‌న్ను, టాక్పి ఎక్క‌తే ప‌న్ను ఇలా వేయాల్పిన రోజులు వ‌స్తాయోమో అని ముక్కున వేలేసుకున్నారు. కేంద్రంలో బిజెపి పాల‌నపై ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని విమ‌ర్శించారు. ఆరునెల‌ల పిల్ల‌గాడు అమ్మా నాకు పెన్సిల్ కొనివ్వు అని అడిగితే వాళ్ల అమ్మ గుర్రుమ‌ని కొడుతున్న ప‌రిస్థ‌తి ఉంద‌న్నారు. క‌నీసం పెన్సిల్ కూడ కొనివ్వ‌లేని నిరుపేద కుటుంబాలు దేశంలో ఎన్నో ఉన్నామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మోడీ పాల‌న‌పై విసిగెత్తుతే రానున్న రోజుల్లో ఝార్మాండ్ విధాన్ స‌భ‌లో ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని విమ‌ర్శించారు. దేశంలో పేద‌లు అల్లాడిపోతున్నార‌ని అన్నారు. క‌నీసం మంచినీళ్లు తాగ‌లేని దుస్థ‌తిలో పేద‌లు ఉన్నార‌ని అన్నారు. స్వార్థ రాజ‌కీయాల బిజెపి తిరిగి అధికారం చేజిక్కించుకోవాల‌నే త‌ప‌న‌లో ఉంద‌ని అన్నారు. ప్రాంతీయ పార్టీల‌లో చిచ్చుపెట్టే క్ర‌మంలో ముందుకు పోతుంద‌న్నారు. దేశంలో అవ‌నీతి, అక్ర‌మాల‌కు బిజెపి ప్ర‌భుత్వానికి పెట్టింది పేర‌ని విమ‌ర్శించారు.