Wednesday, 4 November 2026

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి) : మండల పరిధిలోని దాసుతండా గ్రామానికి చెందిన బానోతు ఇందులాల్(54) ఆర్థిక ఇబ్బందులు తో మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం తండా సమీపంలో తన వరి పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకునే కంటే ముందు కలుపు మందు కూడా సేవించినట్టు ఆ ప్రదేశంలో ముందు డబ్బా కనిపిస్తుంది. పొలానికి వెళ్లేవారు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని టేకులపల్లి ఎస్సై భుక్యా శ్రీనివాస్ తరలించి విచారణ చేపట్టారు.