ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం
సీపీఎం రాష్ట్ర నాయకులు టి. సాగర్
ఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 28 : దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తి ఆర్ధిక మాంద్యం ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని సీపీఎం రాష్ట్ర నాయకులు టి. సాగర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, ఆర్థిక ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జనచైతన్య బస్ యాత్ర మంగళవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాకు చేరుకుంది. నిర్వహించిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించి దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండ ఆదాయం పెంచకపోవడం వల్లే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, దీని వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఆయన విమర్శించారు. బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వల్ల సంక్షోభాని నివరించలేమని, ప్రజలకు ఉపాధి కల్పించడం వల్లే సంక్షోభాలు నివారించవచ్చున్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి కొదిలేసి రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వ్యక్తులను, వ్యవస్ధలను ప్రజాస్వామ్య గొప్పతనాన్ని దిగజరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ఆర్థిక అగడంలోకి నెట్టి పాలకులు చోద్యం చూస్తున్నారని, విద్య వైద్య రంగాలను ఫ్రీవేటికరణ చేసి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గించి సంక్షోభాలు పెంచి పోషిస్తున్నారు. వ్యవసాయ రంగం కార్పొరేటికరణకు కేంద్రం సిద్దపడుతున్నది అని అందులో భాగంగానే కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించకుండా కాలయాపన చేస్తున్నాడన్నారు. ప్రజలు వివిధ రకాల ఆర్థిక సామాజిక ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు పోరాటాలు చేస్తే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి విభజన రాజకీయాలు చేస్తున్నాడన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అపోచవన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎం.వి. రమణ, ఎస్.వి. రమ, విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు వి.వి. నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, నర్మదా, స్థానిక నాయకులు రాజేష్, నర్సింహులు, రాజేష్, రఘు, రామకృష్ణ, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం




