నిధుల మంజూరు పత్రాల అందజేత
ఆగస్టు 17 (జనం సాక్షి ):చొప్పదండి మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు, గ్రామంలో నిర్మాణం చేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో బోర్వెల్ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల నిధుల మంజూరి పత్రాలను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బూరుగుపల్లి లోని ఎమ్మెల్యే నివాస గృహంలో గ్రామ సర్పంచ్ వెల్మ నాగిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నిర్మాణం చేస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో బోర్వెల్ కు నాలుగు లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దెల్లి సురేష్ ,బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి ,మండల నాయకులు గాండ్ల లక్ష్మణ్, ప్రభాకర్, పృద్వి, శైలేష్, తదితరులు పాల్గొన్నారు.