ఆర్థిక సహాయం అందజేత

చొప్పదండి ,ఆగస్టు 18 (జనం సాక్షి): రెండు కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సలు డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న చొప్పదండికి చెందిన పొన్నం శ్రీనివాస్ కు వైద్య ఖర్చులకోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిపల్లి సత్యం రూ.పదివేలు, భూపాలపట్నం బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాకాల నారాయణ రూ.5000, చొప్పదండి ఓంకార్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు తాళ్లపల్లి కనుకయ్య పద్మ దంపతులు రూ.5000 ,చొప్పదండి పట్టణ మొదటివార్డు కౌన్సిలర్ కొట్టె అశోక్ రూ.2000 ఆర్థిక సహాయం అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతా కార్మికుడిగా కులవృత్తి చేస్తూ రైస్ మిల్ ఆపరేటర్ గా పనిచేస్తూ అనారోగ్యానికి గురై కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సకు డబ్బులు లేక ఆస్పత్రికి వెళ్లలేక ఇంట్లోనే ఉండడం బాధాకరమని అన్నారు. శ్రీనివాస్ కు తమ వంతు ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అయ్యే వైద్య చికిత్సకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు పెరుమండ్ల గంగయ్య గౌడ్, సభ్యులు బొడిగె నందయ్య గౌడ్, పూదరి లక్ష్మయ్య గౌడ్, బొడిగె హనుమంతు గౌడ్, బుర్ర మల్లికార్జున్ గౌడ్, పొన్నం లచ్చయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చేపూరి సత్యనారాయణ గౌడ్, ముద్దం తిరుపతి ,పురం రాజేశం తదితరులు పాల్గొన్నారు.