ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బొల్లం మునగాల, ఫిబ్రవరి 28(జనంసాక్షి): మునగాల మండలం సీతానగరం గ్రామం చెందిన పుల్లూరి రామారావు(40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రామారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేగాక ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిశాల రఘు ద్వారా అందజేశారు. ఆపదలోన ప్రతి కుటుంబానికి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన హామి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రామారావు విబికేగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పడిశాల రఘు,ఐకెపి వివోఏల జిల్లా అధ్యక్షురాలు కన్నం శారద, జిల్లా కార్యదర్శి పండగ శైలజ, మండల అధ్యక్షురాలు ఉమారాణి, మండల వివోస్ వెంకన్న, షాబీర, సామ్రాజ్యం, శైలజ తదితరులు పాల్గొన్నారు.




