ఆర్థిక సాయం అందజేత గుర్రం లక్ష్మారెడ్డి…

వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 11 మండలం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు గుంతలు ఏర్పడడం వలన వలిగొండ నుండి రేడ్లరేపాక గ్రామానికి టూ వీలర్ పై జనం సాక్షి పత్రిక రిపోర్టర్ బద్దం నరసింహ వెళుతుండగా  బైకు స్కిడ్  అవడం వలన పడగా కాలు విరిగిపోయినందున పరమశించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తము కొరకు టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి సొంత నిధులనుండి ఆర్థిక సాయం 5000 రూపాయలు  ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందుల నరేష్ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ జాంగిర్ పాల్గొన్నారు.