లోతట్టు ప్రాంతాలు సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

వరంగల్ ఈస్ట్, జూలై 25 (జనం సాక్షి)మాజీ మంత్రి,మెమ్మెల్సీ కొండ దంపతుల ఆదేశానుసారం డివిజన్ అధ్యక్షులు షేర్ల కిషోర్ మరియు సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నారగోని స్వప్న మురళి గౌడ్ ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీ కాశి కుంట ప్రాంతం లోతట్టు ప్రాంతాలను సందర్శించడం జరిగింది. అలాగే వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు షేర్ల కిషోర్ మాట్లాడుతూ చిన్న వర్షానికి కాలనీ ఇళ్లలోకి నీళ్లు రావడం వలన ఆహారం కానీ త్రాగడానికి నీరు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు తద్వారా అంటువ్యాధులు సీజనల్ వ్యాధులు అలాగే విష సర్పాల నుండి జాగ్రత్తగా ఉండమని మరియు చిన్నపిల్లలను విద్యుత్ స్తంభాల నుండి దూరంగా ఉంచాలని డ్రైనేజీలకు దూరంగా ఉంచాలని వారికి తెలియజేయడం జరిగింది అలాగే కొండా మురళి దంపతులకు ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడించి వారికి భరోసా కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సందీప్ పటేల్ విక్రం భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు

తాజావార్తలు